Monday, 27 April 2020

పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబో.. మెగా అభిమానులు పండగ చేసుకునే అప్‌డేట్!

సాధారణంగా సినిమా అంటేనే మెగా అభిమానులకు అదో పండగ. అలాంటిది ఆయన మల్టీస్టారర్ మూవీ అంటే వాళ్ల ఆనందానికి హద్దులే ఉండవు. అది కూడా ఇతర భాషకు చెందిన మరో హీరోను భాగం చేయడమంటే ఇక కన్నుల పండగే. సరిగ్గా అల్లాంటి పనే చేస్తున్నారట డైరెక్టర్ . పవన్ కళ్యాణ్‌తో తాను చేయబోతున్న కొత్త సినిమా కోసం భారీ స్కెచ్ వేశారట క్రిష్. మల్టీస్టారర్ మూవీగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఆయన ప్లాన్ చేశారని తెలుస్తోంది. తన 26వ సినిమాగా పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీ జానపద నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ డ్రామా అని తెలిసింది. కోహినూర్ వజ్రం దొంగలించే దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో హీరోగా భాగం కానున్నారని లేటెస్ట్ టాక్. ఇందులో ఓ కీలక పాత్ర కోసం తమిళ హీరో శివ కార్తికేయన్‌ను తీసుకున్నారని, అంతేకాదు ఆయన పాత్ర పరిధిని మరింత పెంచి మల్టీస్టారర్ రేంజ్‌లో ఈ మూవీ రూపొందించేలా క్రిష్ సన్నాహాలు చేస్తున్నారనే సమాచారం బయటకొచ్చింది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని అంటున్నారు. ఈ న్యూస్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది. రీ ఎంట్రీలో పవన్ మల్టీస్టారర్, అది కూడా క్రిష్ దర్శకత్వంలో అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ క్రిష్ ఈ టైటిల్‌ను ఫిలించాంబర్లో రిజిస్టర్ చేయించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. చూద్దాం మరి పవన్- క్రిష్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y9Zbuo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...