Monday, 27 April 2020

యువ హీరోతో బోల్డ్ సీన్స్‌.. రెచ్చిపోయి రొమాన్స్.. యంగ్ హీరోయిన్ ట్రాక్ చేంజ్!

ఈ రోజుల్లో హీరోయిన్స్ అన్నాక అందాల ఆరోబోత తప్పనిసరి. టాలెంట్ బయటపెడుతూ అందాలు ఆరోబోస్తే తప్ప ప్రేక్షకాదరణ, పాపులారిటీ దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే అందాల భామలంతా ఒక్కొక్కరుగా గ్లామర్ ఒలకబోయడం మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ రూటు మార్చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో పద్ధతైన దుస్తుల్లో కనిపించి ఆకర్షించిన ఈ బ్యూటీ ఇక అందాల ఆరబోత షురూ చేయనుందట. యువ కథానాయకుడు నితిన్‌తో కలిసి ఓ రేంజ్ రొమాన్స్ పండించేందుకు ఆమె సై అన్నట్లు టాలీవుడ్ టాక్. హీరోగా రూపొందనున్న 'అంధాదున్' తెలుగు రీమేక్ కోసం ప్రియాంక అరుళ్ పేరును పరిశీలించిన మేకర్స్.. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అంటే ఈ మూవీ ఒరిజినల్ వర్షన్‌లో హీరో ఆయుశ్మాన్ ఖురానా, హీరోయిన్ రాధికా ఆప్టేల కాంబోలో చిత్రీకరించిన బోల్డ్ సీన్స్ ఇప్పుడు నితిన్- ప్రియాంక అరుళ్ చేయనున్నారన్నమాట. ఇది తెలిసే ప్రియాంక ఓకే చెప్పిందని, ఈ మూవీతో తన కెరీర్ టర్న్ చేసుకోవాలని ఆమె భావిస్తోందని ఫిలింనగర్ టాక్. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ తెలుగు రీమేక్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో అనసూయను గానీ, రమ్యకృష్ణను గానీ కీలకపాత్రలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఇద్దరిలో రమ్యకృష్ణతో ఇప్పటికే డీల్ సెట్ అయిందని కూడా తెలుస్తోంది. సో.. కాస్ట్ విషయంలో మేకర్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చూస్తుంటే అంధాదున్ తెలుగు రీమేక్ నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయమే అనిపిస్తోంది కదూ!. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bSXwNu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...