Thursday, 23 April 2020

సింగిల్ స్క్రీన్‌పై అల్లు అర్జున్- చిరంజీవి.. మెగాస్టార్ డిసీజన్ మారిందా?

మలయాళీ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్, పృథ్వీ రాజ్ హీరోలుగా రూపొందిన ఈ మూవీ.. అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో స్టైలిష్ స్టార్ కూడా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. లూసిఫర్ ఒరిజినల్ వర్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించగా ఆయనకు నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. దీంతో తెలుగు రీమేక్‌లో పృథ్వీరాజ్ పోషించిన పాత్రనే అల్లు అర్జున్ పోషించబోతున్నారనే టాక్ బయటకొచ్చింది. తీసుకున్న డిసీజన్ ప్రకారమే అల్లు అర్జున్ ఈ మూవీలో భాగం కానున్నారని అన్నారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీలో అల్లు అర్జున్- చిరంజీవి కలసి నటించబోతున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. లూసిఫర్ రీమేక్‌లో మరో క్యారెక్టర్ విషయమై చిరంజీవి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నాయి మెగా సన్నిహిత వర్గాలు. అంతేకాదు పృథ్వీ రాజ్ పోషించిన ఆ పాత్ర రామ్ చరణ్ చేస్తేనే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే చిరంజీవి తాజా సినిమా 'ఆచార్య'లో ఓ ముఖ్యపాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు లూసిఫర్ రీమేక్‌లో కూడా ఆయనే అయితే ఇక మెగా అభిమానులకు అంతకుమించిన కన్నులపండగ మరొకటి ఉండదనే చెప్పుకోవాలి. చూద్దాం మరి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Ypnt1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...