Thursday, 23 April 2020

9 వారాలుగా ప్రత్యేక వ్రతం చేస్తున్న ఉపాసన.. ప్రసాదం తయారీపై పోస్టు

మెగా ఫ్యామిలీలో ఎవరు ఎలా ఉన్నా.. ఉపాసన కొణిదెల మాత్రం చాలా స్పెషల్. ఓ భార్యగా, కోడలిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఇక చాలా వరకు సామాజిక అంశాల పట్ల కూడా ఆమె స్పందిస్తు ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన ఉపాసన అనేక రకాల ట్వీట్లు పెడుతుంటారు. తాజాగా ప్రసాదం తయారు చేస్తున్నట్లు ఉపాసన ఓ ట్వీట్ చేశారు. తాను సాయిబాబా వ్రతంలో ఉన్నానని ... ఇది తొమ్మిదవ వారం అని ట్వీట్ చేశారు. ఇవాళ గురువారం కావడంతో ఉపాసన బాబ వ్రతానికి సంబంధించిన వార్తను తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేశారు. ఉపాసన ట్వీట్ పై రామ్ చరణ్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వదిన సూపర్ అంటూ కితాబిస్తున్నారు. కరోనా విషయంలో కూడా నెటిజన్స్‌కు ఎప్పటికప్పుడు ఉపాసన సలహాలు, సూచనలు చేస్తుంటారు.ఇటీవల ఆమె టాయిలెట్ పొజీషన్‌లో కూర్చోగలరా అంటూ కొత్త ఛాలెంజ్ విరిసారు. ఇలా 5 నిమిషాల పాటు ఇలా కూర్చోగలరా ? అంటూ నెటిజన్స్‌కు కొత్త పరీక్ష పెట్టారు. ‘నగరంలో నివసించే చాలామంది ప్రజలకు ఈ స్థితిలో కూర్చోవడానికి కష్టపడతారు. ఇది చాలా కఠినంగా ఉంది’ అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. మోకాళ్ల మీద రెండు చేతులు సపోర్ట్ చేసి కూర్చుని ఉన్న ఫొటోని కూడా ఆమె తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇలా కూర్చోవడం చూసే వారికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ అలా కూర్చోవడం చాలా కష్టం, హైదరాబాద్ లో చాలా మంది ఇలా కూర్చోవడానికి కష్టపడతారని ఆమె పేర్కొంది. ప్ర‌స్తుతం ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఉపాసన చేసిన ఈ ఛాలెంజ్ పై కూడా చాలామంది ప్రశంసలు కురిపించారు. ఉపాసన రియల్లీ గ్రేట్ అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3axmIb8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...