Thursday, 23 April 2020

ఉప్పెన తమిళ్ రీమేక్.. రంగంలోకి స్టార్ హీరో కొడుకు!

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శర్మ నటిస్తోంది. వైష్ణవ్ తేజ్ జాలరిగా కనిపించనుండటం విశేషం. షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా తాజా సమాచారం మేరకు ఈ క్యూట్ లవ్ స్టోరీని తమిళ భాషలోనూ రీమేక్ చేయబోతున్నారని తెలిసింది. ఈ మూవీ తమిళ్ రీమేక్ హక్కులను విజయ్ సేతుపతి దక్కించుకున్నట్లు సమాచారం. ఈ రీమేక్‌లో తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్‌ని హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. విజయ్‌కు విజయ్ సేతుపతికి మంచి ఉన్న స్నేహబంధంతో ఈ మూవీ ద్వారా జాసన్ సంజయ్‌ కెరీర్‌కి పునాది వేయాలనే ఆలోచనకు వచ్చారట. ప్రస్తుతం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ కెనడాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే ఆయన విదేశాల నుంచి తిరిగి వస్తాడని, ఆ వెంటనే సెట్స్ మీదకు రావొచ్చని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఉప్పెన తెలుగు వర్షన్‌కు దర్శకత్వం వహించిన బుచ్చి బాబుయే తమిళంలో కూడా దర్శకత్వం వహించనున్నట్లు టాక్. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cGWFj0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...