Thursday, 23 April 2020

మెగా లేడీస్ మేకప్ ఛాలెంజ్... స్టెప్పులేసిన బన్నీ భార్య

కరోనా లాక్ డౌన్‌తో సినిమా తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.అయితే ఇంట్లోనే రకరకాల పనులు వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఓవైపు సినిమా హీరోలంతా రియల్ మేన్ ఛాలెంజ్ చేస్తుంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ సరికొత్త ఛాలెంజ్ ప్రారంభించారు. మెగా లేడీస్ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఇందులో చిరంజీవి ఇద్దరు కూతుర్లు, సుస్మిత, శ్రీజ ఉన్నారు. వీరితో పాటు నాగబాబు కూతురు నిహారిక, స్నేహారెడ్డి కూడా కనిపించారు. అయితే ఈ సాంగ్‌ను నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల డైరెక్ట్ చేసినట్లు సమాచారం. వీరితో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన మరికొందరు ఆడవాళ్లు కూడా కనిపించారు. మేకప్ వేసుకొని కనిపించలంటూ ఓ ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు ఈ వీడియోతో పాటు... సరికొత్త ఛాలెంజ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరి వీడియోకు బాలీవుడ్ ఫేమస్ సాంగ్ ‘ మేర సూట్ పటియాలా కితనోంకొ మార్ డాలా’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడారు. ఈ పాటకు తగ్గట్లు స్టెప్పులేస్తూ... మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ అంతా స్టెప్పులు కూడా వేశారు. అయితే ఎక్కడా పెద్దగా కనిపించిన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఈ వీడియోలో ఎంతో యాక్టివ్‌గా కనిపించారు. బాలీవుడ్ పాటకు స్టెప్పులేస్తూ అందర్నీ ఆమె ఆకర్షించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెెగ వైరల్ అవుతోంది. 6ో


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SgqjUP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...