Thursday, 23 April 2020

క్యారెట్, పన్నీర్‌తో కలర్ ఫుల్ కర్రీ చేసిన వెంకటేష్... మహేష, వరుణ్‌కు ఛాలెంజ్

అందరూ వెయిట్ చేస్తున్నట్లు విక్టరీ బి ది రియల్ మేన్ వీడియో వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి దోశె వేస్తే వెంకటేష్ మిక్స్‌డ్ వెజిటేబుల్ కూర వండాడు. బీ ది రియల్ మెన్ ఛాలెంజ్‌లో భాగంగా ఎన్టీఆర్ సవాల్‌ని స్వీకరించిన వెంకటేష్‌ ఈ మేరకు ఇంటి పనులు చేస్తూ వీడియో పోస్టు చేశాడు. ఇల్లు క్లీనింగ్ చేసి, గార్డెనింగ్ పనులు కూడా చేశారు. అంతటితో కాకుండా కిచెన్‌లోకి వెళ్లి కలర్ ఫుల్ కర్రీ కూడా వండి వార్చాడు. చకచక క్యారట్ ముక్కలు కట్ చేసి... అందులో పన్నీర్ వేసి నోరూరించే విజిటేబుల్ కర్రీని కూడా వెంకీ అద్భుతంగా చేసినట్టు వీడియో ద్వారా పోస్టు చేశారు. ఇక తన ఛాలెంజ్‌ పూర్తయ్యిందన్న వెంకీ.. హీరో వరుణ్ తేజ్‌,సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు అనీల్ రావిపూడికి ఛాలెంజ్ విసిరారు. వెంకటేష్ విసిరిన ఛాలెంజ్‌కు అనిల్ రావిపూడి స్పందించారు. ఛాలెంజ్ యాక్సెప్టడ్ అంటూ ట్విట్టర్ ద్వారా ఆయన రిప్లై కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన చిరంజీవి ఇవాళ ఉదయం ఇంటి పనులు చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాక్యూమ్ క్లీనర్‌తొ ఇళ్లంతా క్లీన్ చేశారు మెగాస్టార్. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా టిఫిన తయారు చేశారు. పొయ్యిపై పెనం పెట్టి గుండ్రంగా దోశ వేశారు. ఆ తర్వాత ఆ దోశను తీసుకెళ్లి తన తల్లి అంజనా దేవికి అందించారు. అయితే కొడుకు తీసుకొచ్చిన టిఫిన్‌ను చూసి మురిసిపోయిన తల్లి... మొదటి ముద్ద కొడుకుకే తినిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eJCVNH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...