Thursday, 23 April 2020

చిరంజీవి సినిమాలా? వరుణ్‌కి అదో పెద్ద సవాల్.. నాగబాబు కామెంట్స్

కరోనా కల్లోలం కారణంగా దేశమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. సినిమా షూటింగ్స్ సహా అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో జనమంతా ఎవ్వరి ఇంట్లో వారే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ కరోనా పట్ల అవగాహన పెంపొందిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. అంతేగాక ఆన్‌లైన్ చాట్స్ చేస్తూ తమ మనుసులో మాటలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా యాంకర్ రవితో లైవ్ చాట్ చేసిన మెగా బ్రదర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. చిరంజీవిగారు నటించిన సినిమాల్లో ఏదో ఒక సినిమాను వరుణ్ తేజ్‌తో రీమేక్ చేయాల్సివస్తే ఏ సినిమా చేస్తారని రవి అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. ''అన్నయ్య చేసిన సినిమాల్లో నాకు 'ఛాలెంజ్' మూవీ చాలా ఇష్టం. సత్యానంద్ గారు మంచి స్క్రీన్ ప్లేను అందించారు. బాడీ లాంగ్వేజ్‌కి ఈ సినిమా అయితే బాగా సూట్ అవుతుందని అనిపిస్తుంది. అలాగే అన్నయ్య సినిమాల్లో 'కొదమ సింహం' కూడా నా ఫేవరేట్ మూవీ. హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందించిన ఈ మూవీ కూడా వరుణ్ తేజ్‌కు సెట్ అవుతుందని అనుకుంటున్నా'' అని చెప్పారు. కాకపోతే అన్నయ్య చేసిన సినిమాలను రీమేక్ చేసి మెప్పించడం అంత సులువైన విషయం కాదని నాగబాబు అన్నారు. ఒకవేళ ఆ సినిమా చేయాల్సివస్తే అది వరుణ్‌కి పెద్ద సవాల్ అవుతుందని ఆయన చెప్పారు. ఇక ఇటీవలే జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పిన నాగబాబు ప్రస్తుతం అదిరింది షో జడ్జ్‌గా చేస్తున్నారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరుతో ఏర్పాటు చేసిన తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు అంశాలపై ప్రత్యక్షంగా రియాక్ట్ అవుతున్నారు మెగా బ్రదర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KujsCS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...