Thursday, 23 April 2020

రాజమౌళి మైనస్ పాయింట్ ఇదే.. సీక్రెట్ రివీల్ చేసిన కీరవాణి

తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు మైనస్ పాయింట్స్ చెప్పారు సంగీత దర్శకుడు ఎంఎం . కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న ఆయన ప్రముఖ మీడియా సంస్థకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పడమే గాక, తన కజిన్ రాజమౌళిలో తనకు నచ్చిన పాయింట్స్, నచ్చని పాయింట్స్ చెప్పారు. అపజయమంటూ ఎరగని దర్శకుడిగా సత్తా చాటుతూ వస్తున్న రాజమౌళి ఓ విషయంలో ఎంత చెప్పినా వినరని చెప్పారు కీరవాణి. ఖాళీ సమయం దొరికితే ఆయన ఎక్కువగా చిన్నపిల్లల సినిమాలు చూస్తుంటారని, కాస్త మెచ్చుర్డ్ సినిమాలు చూడమని చెప్పినా వినకుండా అదే కంటిన్యూ చేస్తారని చెప్పుకొచ్చారు కీరవాణి. కొన్నేళ్ల క్రితం వచ్చిన అమెరికన్ కామెడీ డ్రామా 'ఫారెస్ట్ గంప్' సినిమా చూడమని చెబితే ఇంతవరకు ఆ సినిమా చూడలేదని అన్నారు. రాజమౌళికి సంబంధించి ఇదే విషయం తనకు నచ్చదని కీరవాణి చెప్పారు. అలాగే రాజమౌళికి సంబంధించి తనకు నచ్చే విషయం కూడా చెప్పారు కీరవాణి. ఆయనకు ఏకాగ్రత చాలా ఎక్కువని, ఏదైనా అనుకుంటే దానిని సాధించేవరకు వదలరని అన్నారు. ఒక సంకల్పంతో కష్టపడి పని చేసే మనస్తత్వం రాజమౌళిది అని, అదే తనలో బాగా నచ్చే విషయమని కీరవాణి అన్నారు. తమ కాంబోలో రాబోతున్న సినిమాలో మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని, ఇరువురు హీరోల ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆయన తెలిపారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి RRR మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా.. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ బడా హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే మిగిలిన భాగం ఫినిష్ చేసి వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాను విడుదల చేయాలనేది జక్కన ప్లాన్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eHECLr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...