Friday, 10 April 2020

అల్లు అర్జున్‌పై సీఎం కామెంట్స్.. ఆ విషయం అస్సలు మరచిపోమంటూ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు కేరళ సీఎం పినరయి విజయన్. కరోనా కట్టడిలో భాగమవుతూ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అల్లు అర్జున్ అందించిన విరాళం పట్ల స్పందించిన పినరయి విజయన్.. ఈ సహాయానికి కేరళ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమ రాష్ట్రాన్ని కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన చాలా గొప్పదని సీఎం తెలిపారు. ఈ ఆపత్కాలంలో అల్లు అర్జున్ చేసిన ఈ సాయాన్ని కేరళ ప్రజలు ఏనాటికీ మరచిపోరని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది కరోనా మహమ్మారి. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేసేందుకు గాను 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించి పెద్దఎత్తున సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ప్రభుత్వాలకు అండగా మేమున్నాం అంటూ ముందుకొస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు తమ తమ విరాళాలు సీఎం సహాయనిధికి అందిస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అంతా అటు కేంద్రం, ఇటు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించి మానవీయత చాటుకున్నారు. Also Read: అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో 50 లక్షల రూపాయలు విరాళం అందించడంతో పాటు కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కి మరో 25 లక్షల రూపాయలు అందించారు. అలా మొత్తంగా రూ. 1 కోటి 25 లక్షలు విరాళం ప్రకటించారు అల్లు అర్జున్. ఈ మేరకు తాజాగా స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్.. బన్నీని ప్రశంసల్లో ముంచెత్తారు. ఇకపోతే ఇటీవలే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో 20వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి ఇటీవలే ‘పుష్ప’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌కి బన్నీ అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xqv1Ti
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...