Friday, 24 April 2020

ఘట్టమనేని వారి రక్త సంబంధంపై బండ్ల గణేష్ కామెంట్స్.. ఏమన్నాడంటే!!

సూపర్ స్టార్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటారు. షూటింగ్స్ గ్యాప్ దొరికిందంటే చాలు ఫ్యామిలీతో టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేయడం ఆయనకు అలవాటు. ఇక ఇంట్లో అయితే భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో స్నేహితుడిలా మెలుగుతూ వారితో సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ సమయంలో కుటుంబం కోసం మరింత సమయాన్ని కేటాయించి హ్యాపీగా పిల్లలతో అల్లరి అల్లరి చేస్తున్నారు. ఇక సితార, గౌతమ్, మహేష్ చేస్తున్న అల్లరి తాలూకు సంగతులు, హోమ్ క్వారంటైన్ విశేషాలు ఎప్పటికప్పుడు మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. దీంతో తన గారాలపట్టి సితారతో మహేష్ గడిపిన సరదా సమయాన్ని చూసి తెగ మురిసిపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. తాజాగా మహేష్ బాబుకు హెడ్ మసాజ్ చేస్తూ సితార దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తండ్రికి మసాజ్ చేస్తూ దిగిన పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది సితార పాప. ఈ మేరకు నాన్నకు హెడ్ మసాజ్ చేస్తున్నానని, ఆయన జుట్టు చాలా సాఫ్ట్‌గా ఉందని తెలిపింది. నాన్నకు ఇది చాలా బాగా నచ్చిందని, ఆయన రెస్పాన్స్ చూసి తనకు చాలా సంతోషం కలిగిందని పేర్కొంది సితార. దీంతో ఈ పిక్ చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇక ఈ పిక్ చూసిన .. దాన్ని షేర్ చేస్తూ 'ఘట్టమనేని వారి రక్తసంబంధం చూడముచ్చటగా ఉంది' అని కామెంట్ చేయడం విశేషం. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో భారీ హిట్ సొంతం చేసుకున్న ఆయన, పరశురామ్ డైరెక్షన్‌లో తన తదుపరి సినిమా చేయబోతున్నారు. లాక్ డౌన్ ఫినిష్ అయ్యాక ఈ మూవీ ప్రారంభం కానుంది. అలాగే రాజమౌళితో కూడా సినిమా ఉండనుందని ఇటీవలే కన్ఫర్మ్ అయింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xJUgWd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...