మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు వీకే నరేష్ తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న ఈ సమయంలో ‘మా’ సభ్యులకు అండగా నిలబడటం తన బాధ్యతగా భావించిన ఆయన తన వంతుగా 100 కుటుంబాలని దత్తత తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘మా’ ద్వారా సర్వే చేయించి 58 మంది సభ్యులకు ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 10,000 చొప్పున డిపాజిట్ చేశారు. అదే విధంగా సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి తన వంతుగా మరో రూ. 1 లక్ష విరాళం అందజేస్తున్నట్లు నరేష్ ప్రకటించారు. కరోనా మహమ్మారిని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని, అందరూ తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉండి, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని నరేష్ పిలుపునిచ్చారు. మరోవైపు, కరోనా క్రైసిస్ ఛారిటీకి తనవంతు సహాయంగా ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్ర నిర్మాత, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇలాంటి ఊహించని కష్ట కాలంలో చేతనైనంత సహాయం చేయడం ద్వారానే కలిసికట్టుగా కరోనాను జయించవచ్చని రాధామోహన్ అన్నారు. అలానే లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రజలను కోరారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RhgjtF
v
No comments:
Post a Comment