Monday, 6 April 2020

AA20 అప్‌డేట్: ఏప్రిల్ 8న తెల్లార్తో 9 గంటలకు రెడీ కాండబ్బా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన 20 సినిమా నుంచి అప్‌డేట్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 20 సినిమా నుంచి ఒక సర్‌ప్రైజ్ రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. ‘‘ఏమబ్బా, అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే AA20 అప్‌డేట్ ఏప్రిల్ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా’’ అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ ఈ ప్రకటనలో రాయలసీమ యాసను వాడింది. అంటే, అల్లు అర్జున్ ఈ సినిమాలో ఇదే యాసలో మాట్లాడబోతున్నారన్న మాట. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. Also Read: మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ నిలిచిపోయింది. చిత్ర యూనిట్ అంతా ఇళ్లకే పరిమితమైంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ అప్‌డేట్ చిత్ర ఫస్ట్‌లుక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. టైటిల్‌తో కూడిన అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారని అంటున్నారు. అయితే, అల్లు అర్జున్ వాయిస్‌తో కూడిన చిన్న టీజర్ కూడా రాబోతోందని మరో టాక్. చూద్దాం ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VaMtbH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...