Thursday, 19 March 2020

RRRలో మూడు పాటలు రాశా.. కథ చెప్పేసిన సుద్దాల అశోక్ తేజ

రాజమౌళి, , ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం కథ ఏంటన్న దానిపై ఇప్పటికే రాజమౌళి కొంత క్లారిటీ ఇచ్చారు. ఇది 1920 నాటి ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ మూవీ అని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీలు కలిసి పోరాడితే ఎలా ఉంటుంది అనే కోణంలో అల్లిన కథే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అని ఆర్ ఆర్ ఆర్ కథ స్టోరీ లైన్‌ను మీడియాకి ముందే లీక్ చేశారు రాజమౌళి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు వీరులు, ఒకరితో ఒకరు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు, ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయి ఉంటే.. వాళ్ల మధ్య స్నేహం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో కంప్లీట్‌ ఫిక్షనల్‌గా ఈ సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. 1920 లో జరిగే కథ కాబట్టి ఆనాటి జీవన విధానం, మనుషుల వ్యక్తిత్వం, నేటివిటీపై రీసెర్చ్ చేసి ఈ సినిమాను రియలిస్టిక్‌గా చెక్కుతున్నారు రాజమౌళి. అయితే కొంతమేర ఈ కథపై రాజమౌళి క్లారిటీ ఇచ్చినా.. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఎలా బ్యాలెన్స్ చేస్తూ కథ రెడీ చేశారన్నదానిపై సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కథానుగుణంగా మూడు పాటలను రాసిన ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ.. ఆర్ ఆర్ ఆర్ కథపై మరింత క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశా.. రాజమౌళిగారు.. కీరవాణిగారు చాలా బాగా రాశావు అని పొగిడారు. చాలా సంతోషించారు. అయితే రాజమౌళి గారు కథ చెప్పినప్పుడు.. ఒకే సమయంలో తెలంగాణ నుంచి కొమరం భీం, ఏపీ నుంచి సీతారామరాజు ఒకేసారి మిస్ అవుతారు. ఓ రెండేళ్లుపాటు ఇద్దరూ కనిపించరు. ఎటు వెళ్లారో ఎవరికీ తెలియదు. రెండేళ్ల తరువాత ఆ ఇద్దరూ వచ్చి.. ఆయన స్వాత్రంత్య్య పోరాటం బ్రిటీష్ దొరలపై చేస్తే.. ఇక్కడ కొమరం భీం నైజాం రాజు మీద పోరాటం చేస్తారు. ఆ రెండు సంవత్సరాల సమయంలో వాళ్ళిద్దరూ కలుసుకుని ఉంటే.. వాళ్లకు వచ్చిన అనుభవాలు ఏమై ఉంటే.. వాళ్లు పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చారనే గొప్ప సృజనాత్మక ఆలోచన రాజమౌళి గారిది. ఆయన ఆలోచన నుంచి వచ్చిన కల్పితమే ‘’ సినిమా కథ. ఇంతవరకూ మాకు ఆయన ఇదే చెప్పారు. మాకు చెప్పిన కథను ఎవరికీ చెప్పొద్దని అన్నారు. ‘మీరు ఇప్పుడు ఏ పాట రాస్తున్నారో ఆ పాట పల్లవి కూడా మీ శ్రీమతికి కూడా చెప్పొద్దు’ అని అన్నారు. అందువల్ల మాకు ఆ నిబంధన ఉండటం వల్ల ఆడియో రిలీజ్ అయ్యే వరకూ ఆ పాట కాని.. సినిమా కథకు సంబంధించిన విషయాలు కాని వెల్లడించదల్చుకోలేదు’ అంటూ ఆర్ ఆర్ ఆర్ కథపై కొంత క్లారిటీ ఇచ్చారు సుద్దాల అశోక్ తేజా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wogAUm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...