Thursday, 19 March 2020

Coronavirus: సెల్ఫ్ క్వారంటైన్‌లో స్టార్ హీరోయిన్.. అత్తతో గదిలో నుంచే ముచ్చట్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ అహుజ.. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి మంగళవారం లండన్ నుంచి ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) విజృంభిస్తున్న నేపథ్యంలో తన వంతు బాధ్యతగా సోనమ్ కపూర్ తనను తాను గదిలో నిర్బంధించుకున్నారు. 14 రోజులపాటు సోనమ్ కపూర్, ఆనంద్ అహుజ ఒక గదిలో ఉండనున్నారు. ఈ విషయాన్ని సోనమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, సోనమ్ భర్త ఆనంద్ తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో సోనమ్ తన అత్తమ్మ ప్రియా అహుజాతో మాట్లాడుతున్నారు. సోనమ్ పై అంతస్తులో ఉన్న తన గదిలో కిటికీ వద్ద నిలబడి కింద ఉన్న అత్త ప్రియాతో మాట్లాడుతున్నారు. అంటే, సోనమ్ అస్సలు రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకే తనవాళ్లను కూడా ఈ 14 రోజులు కలవకూడదని నిర్ణయించుకున్నారు. లండన్ నుంచి వచ్చారు కాబట్టి సామాజిక బాధ్యత వహిస్తూ సోనమ్, ఆనంద్ ఎవరితో కలవకుండా 14 రోజుల పాటు ఒక గదిలో ఉండనున్నారు. అయితే, సోనమ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, లండన్ నుంచి ఇండియాకు తిరిగివచ్చిన తరవాత కరోనా వైరస్ భద్రతా చర్యలపై తన అనుభవాన్ని సోనమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇండియన్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఎయిర్‌పోర్టులో అన్ని ఎగ్జిట్ పాయింట్ల వద్ద అధికారులు తీసుకుంటోన్న జాగ్రత్తలు అద్భుతమని అన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస స్టోరీలు పెట్టారు. Also Read: ‘‘ఆనంద్ నేను ఢిల్లీ చేరుకున్నాం. మేమిద్దం ప్రస్తుతానికి ఒకే రూంలో ఉన్నాం. విమానంలో మాతోపాటు ప్రయాణం చేసినవారికి, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి థ్యాంక్స్. చాలా ప్రశాంతంగా, బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారు. మేం లండన్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడ ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయలేదు. అది చూసి మేం షాకయ్యాం’’ అని సోనమ్ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U3ksmN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...