Thursday, 19 March 2020

కొడుకుతో కలిసి సమీరారెడ్డి స్పెషల్ వీడియో.. సో క్యూట్

హీరోయిన్ సమీరారెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమీరా.. ఆ తరవాత చిరంజీవితో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ సినిమాలో నటించారు. ఈమె తెలుగమ్మాయే అయినప్పటికీ కుటుంబం ముంబైలో స్థిరపడటంతో అక్కడే పెరిగారు. బాలీవుడ్‌కు పరిచయమైన తరవాతే టాలీవుడ్‌కు వచ్చారు. ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’తో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించారు. తెలుగులో చివరిగా ‘కృష్ణం వందే జగద్గురం’ సినిమాలో కనిపించారు. ‘బళ్లారి బావ’ అనే ప్రత్యేక గీతంలో సమీరారెడ్డి నర్తించారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్దేను 2014లో పెళ్లి చేసుకున్న తరవాత సమీరారెడ్డి సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. భర్తతో కలిసి బిజినెస్‌ వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నారు. తన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారు. 2015లో సమీరారెడ్డి దంపతులకు బాబు పుట్టాడు. కిందటేడాది జూలైలో పాపకు సమీరా జన్మనిచ్చారు. సమీరారెడ్డి సినిమాలకు దూరమైనప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. తన వ్యక్తిగత ఫొటోలను షేర్ చేస్తున్నారు. Also Read: ఇదిలా ఉంటే, ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో అది సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి సెలబ్రిటీలు నడుం బిగించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన విధంగా సేఫ్ హ్యాండ్స్ కార్యక్రమంపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సినీ నటులు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సమీరారెడ్డి పాల్గొ్న్నారు. తన కుమారుడుతో కలిసి సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ చేసి చూపించారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. సమీరా రెడ్డి చెబుతుంటే ఆమె కుమారుడు సైగలు చేస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాడు. కాగా, తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో WHO సూచించిన జాగ్రత్తలతో కూడిన ఫొటోలను సమీరా పొందుపరిచారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J0z1Bq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...