పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగొచ్చింది. సుమారు రెండేళ్ల విరామం తరవాత పవన్ సినిమా పోస్టర్‌పై దర్శనమిచ్చారు. అది కూడా ‘వకీల్ సాబ్’గా..! బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రలో ఇక్కడ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్ చాలా బాగుంది. ఈ లుక్‌తో ఇప్పటికే ఆయన్ని చూసేశాం. అయినప్పటికీ ఆ పోస్టర్ మీదకు ఎక్కేసరికి పవన్‌లో ఏదో తెలియని ఆకర్షణ కనిపిస్తోంది. బహుశా వకీల్ సాబ్ ఇల్లు ఖాళీ చేస్తున్నట్టున్నారు. ఒక మినీ వ్యానులో సామానులన్నీ ఎక్కించి.. అందులోనే ఒక చైర్ వేసుకుని కూర్చు్న్నారు. ఇక్కడ కూడా ఆయన ఖాళీగా ఏమీ లేరు.. పుస్తకం చదువుతూ తన పని తాను చూసుకుంటున్నారు. Also Read: కాగా, ‘వకీల్ సాబ్’ సినిమాను బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘పింక్’ను ఇప్పటికే తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ అజిత్ లాయర్ పాత్రలో నటించారు. ఈ సినిమాను కూడా బోనీ కపూర్ నిర్మించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TecAOT
v
No comments:
Post a Comment