Monday, 2 March 2020

ఫూటుగా తాగుతా, బీర్ లేనిదే నేను లేను: నిస్సిగ్గుగా చెప్తున్న హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో తాగడం అనేది ఓ ఫ్యాషన్. తాగకపోతే తప్పుగా అనుకుంటారేమో అన్నట్లు ఉంటుంది వ్యవహారం. ఈవెంట్ ఏదైనా, పార్టీ ఏదైనా మద్యం లేనిదే పని జరగదు. చెప్పాలంటే ఇండస్ట్రీలో దాదాపు 90 శాతం మంది మద్యం తాగుతారనేది టాక్. అయితే కొందరు చెప్పుకుంటారు. మరికొందరు దాస్తారు. అయితే, అనే తమిళ నటి మాత్రం నేను ఫూటుగా మద్యం తాగుతాను అని బల్లగుద్ది మరీ చెప్తోంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీణ మాట్లాడుతూ తెగ ఊగిపోయారు. ‘నాకు తాగుడు అలవాటు ఉందన్న విషయాన్ని బయటపెట్టడానికి నేనెందుకు భయపడాలి? అదేమన్నా క్షమించరాని నేరమా? నేను బీర్ తాగితే నేను చాలా మాట్లాడేస్తాను. నేను ఈ విషయాన్ని గతంలో కూడా వెల్లడించాను. చాలా మంది యంగ్‌స్టర్స్‌కి కూడా అలవాటు ఉంటుంది కదా. ఈ అలవాటు వల్ల ఎవరికీ హాని ఉండదు. ఇది నా వ్యక్తిగతం. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్లు చేస్తుంది తప్పో కాదో ఓసారి సరిచూసుకోవాలి. ఇక నా కెరీర్ విషయానికొస్తే.. నటన విషయంలో నాకు ఎలాంటి నియమాలు లేవు. నాకు మంచి గ్లామరస్ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకే తరహా పాత్రల్లో నటించాలని ఏమీ లేదు. నాకు మంచి స్క్రిప్ట్స్ కావాలంతే. ఓ ఆర్టిస్ట్‌కి ఓపెన్ మైండ్ ఉండాలి. నాకు మంచి క్యారెక్టర్ దొరకాలే కానీ ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తాను’ అని తెలిపారు. READ ALSO: గతంలో నటి శ్రుతి హాసన్ కూడా తనకున్న తాగుడు అలవాటు గురించి వెల్లడించారు. మ‌ద్యం మాన‌లేక కెరీర్ ప‌రంగా కూడా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాన‌ని చెప్పింది. ఇలా బాహాటంగా శ్రుతిహాస‌న్ త‌న బ‌ల‌హీన‌త‌ను బ‌య‌ట‌పెట్ట‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. అయితే ఇప్పుడు తాను మందుకు చాలా దూరంగా ఉన్నాన‌ని, ఇక‌పై మ‌ద్యం జోలికి వెళ్ల‌న‌ని కూడా చెప్పింది. సాధారణంగా సినీ తారలు తమ బలహీనతలు, దురలవాట్ల గురించి బయటకి చెప్పుకోరు. మీడియాలో ఆ తరహా వార్తలు వచ్చినా పుకార్లు అని కొట్టిపారేస్తారుంటారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38ht1OR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...