Monday, 23 March 2020

కన్ఫర్మ్: ‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమా ద్వారా ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెడతారని అంతా అనుకున్నారు. కానీ, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నానని త్రిష అధికారికంగా ప్రకటించారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని సోషల్ మీడియాలో త్రిష పేర్కొన్నారు. త్రిష తప్పుకోగానే ఈ సినిమాలో తరవాత హీరోయిన్‌పై వదంతలు మొదలయ్యాయి. మొదట చిరంజీవి సరసన అనుష్క నటించబోతున్నారని అన్నారు. కానీ, ఆ తరవాత కాజల్ పేరు బయటికి వచ్చింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ను ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ సంప్రదించారని వార్తలు వచ్చాయి. కాజల్ కూడా ఈ ఆఫర్‌ను ఓకే చేశారని అన్నారు. అయితే, ఈ వార్తలను తాజాగా కాజల్ ఖరారు చేశారు. తాను చిరంజీవి సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించారు. జనతా కర్ఫ్యూ రోజు అంటే ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ నిర్వహించిన కాజల్ అగర్వాల్.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో మీ తెలుగులో చేయనున్న సినిమా ఏంటి అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘‘చిరంజీవి సార్ ఫిల్మ్ ‘ఆచార్య’ చేస్తున్నాను. షూటింగ్‌లో పాల్గొనడం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో తన సినిమా షూటింగ్‌ను ఆపేస్తున్నట్టు చిరంజీవి తొలుత ప్రకటించారు. కాగా, ఈ సినిమాలో నక్సలైట్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన వ్యక్తిగా చిరంజీవి కనిపించనున్నారు. దేవాదాయ శాఖలో జరుగుతోన్న అవినీతిపై ఆయన పోరాడనున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాలో రెజీనా ప్రత్యేక గీతంలో నర్తించనున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉందని.. దాన్ని మహేష్ బాబు చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ పాత్రను రామ్ చరణే చేయబోతున్నారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WEtJ6r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...