Monday, 23 March 2020

కష్టాల్లో నాగశౌర్య సినిమా.. తప్పుకున్న దర్శకురాలు!

సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ‘అశ్వథ్థామ’ సినిమా చేసిన యంగ్ హీరో నాగశౌర్య.. ఆ చిత్రం తరవాత సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఒక సినిమాను మొదలుపెట్టారు. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతువర్మ ఈ సినిమాలో హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో టాలీవుడ్‌లో షూటింగ్‌లన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. వాటిలో నాగశౌర్య సినిమా కూడా ఉంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక రూమర్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టారని అంటున్నారు. నిర్మాతకు, చిత్ర దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ దీనికి కారణమని చెబుతున్నారు. దర్శకురాలు లక్ష్మీ సౌజన్య పనిలో నిర్మాత పదేపదే కలుగుజేసుకోవడమే కాకుండా, బాగా ఇబ్బంది పెడుతున్నారట. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాక్. ఈ వార్తలో నిజమెంతో తెలియాలి అంటే మళ్లీ ఇండస్ట్రీలో షూటింగులు మొదలయ్యేంత వరకు ఆగాల్సిందే. కాగా, ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. Also Read: ఇదిలా ఉంటే, నాగశౌర్య ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మహేష్ ఎస్. కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కె.పి.రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలోనే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాలని భావించారు. కానీ, కరోనా వైరస్ భయంతో షూటింగ్‌లు ఆపేసిన సంగతి తెలిసిందే. పరిస్థితి చక్కబడిన తరవాత షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, సితార ఎంటర్‌టైన్మెంట్స్ ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు నాగశౌర్యతో సినిమా మొదలుపెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39agIUP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...