Monday, 23 March 2020

నితిన్ పెద్ద మనసు.. రూ.10 లక్షల చొప్పున విరాళం

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆ మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ సమయంలో పేద ప్రజలను ఆదుకోవడం కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు నిత్యవసర సరుకులు అందించడంతో పాటు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, కరోనా వైరస్‌పై పోరాటం చేయడంలో తన వంతు బాధ్యతగా యంగ్ హీరో నితిన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంక్షేమ నిధులకు ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ‘‘కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఇలాంటి సమయంలో దేశ భద్రత కోసం నా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడానికి అవసరమైన పరికరాల కొనుగోలు కోసం తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షల చొప్పున డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. మనందరం కలిసి పోరాడాలి. ఇంట్లోనే ఉండండి, భద్రంగా ఉండండి’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నుంచి కరోనా వైరస్‌పై పోరాటానికి విరాళం ఇచ్చిన తొలి వ్యక్తి నితిన్. ఆయన్ని చూసి మరింత మంది ముందుకు వస్తారేమో చూడాలి. ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో కానీ, మ‌రేదైనా విప‌త్తుల స‌మ‌యంలో కానీ త‌క్ష‌ణం స్పందించి, త‌న వంతు సాయం చేయ‌డానికి ఎప్పుడూ ముందుండే నితిన్ ప్ర‌స్తుతం ప్ర‌పంచం ఎదుర్కొంటున్న అత్యంత విప‌త్క‌ర ప‌రిస్థితిని మ‌నో ధైర్యంతో ఎదుర్కోవాల‌నీ, అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టించే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ae7rN4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...