Tuesday, 3 March 2020

ఈవెంట్‌కి లేట్‌గా వచ్చిన హీరో, సారీ అంటూ అందరి కాళ్లు పట్టుకుని..

బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఏం చేసినా వైరల్ అయిపోతుంది. అతను వేసుకునే దుస్తులు, చేసే పనులు అన్నీ టాక్ ఆఫ్ ది టౌనే. అయితే, నిన్న రణ్వీర్ చేసిన పని సోషల్ మీడియాలో నానా రచ్చ క్రియేట్ చేస్తోంది. అంతగా ఏం చేసాడబ్బా అనుకుంటున్నారా.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన ‘సూర్యవంశీ’ ట్రైలర్‌ను నిన్న గ్రాండ్‌గా రిలీజ్ చేసారు. ఇందులో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. అజయ్ దేవగణ్, రణ్వీర్ అతిథి పాత్రలు పోషించారు. అక్షయ్‌తో పాటు అజయ్, రణ్వీర్ ఉంటే సందడి అంతా ఇంతా ఉండదు. అందుకే ట్రైలర్ లాంచ్‌కి అందరినీ ఆహ్వానించారు. అయితే ట్రైలర్ లాంచ్ చేసే సమయానికి అక్షయ్, అజయ్, కత్రినా, రోహిత్ టైంకి వచ్చేసారు. కానీ రణ్వీర్ మాత్రం అంతా అయిపోయాక లేట్‌గా వచ్చాడు. దాంతో అతనిపై అంతా కామెంట్స్ చేసారు. సారీ సారీ అంటూ రణ్వీర్ గుంజీళ్లు తీసాడు. అంతేకాదు అక్కడున్నవారి కాళ్లు పట్టుకుని హంగామా చేసాడు. ఆ సమయంలో తీసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ రణ్వీర్ లేట్‌గా ఎందుకు వచ్చాడో తెలుసా.. అతని భార్య దీపిక పదుకొణె వల్లేనట. దీపిక వేరే ప్రదేశానికి వెళ్లిందట. అందుకే లేట్ అయిందని అన్నాడు. ఇందుకు దీపిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ‘నేను ఎక్కడున్నా కూడా ఈవెంట్‌కి టైంకి వెళ్లిపోతాను. నీలాగా లేట్‌గా వెళ్లను’ అని సరదాగా కామెంట్ చేసింది. READ ALSO: ఇక ఈ వీడియో చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. రణ్వీర్ ఈవెంట్‌కి లేట్‌గా వచ్చినా తనదైన శైలిలో బాగానే ప్రమోట్ చేసారంటూ కామెంట్స్ పెడుతున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ‘సూర్యవంశీ’ సమ్మర్‌లో రిలీజ్ అవబోతోంది. అక్షయ్, కత్రినా కాంబినేషన్‌లో రాబోతున్న ఆరో సినిమా ఇది. చాలా గ్రాండ్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టే అర్థమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3crWusI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...