Tuesday, 3 March 2020

మెగా హీరోతో స్ట్రగిలింగ్ హీరో ఫైట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెండితెరపై కిక్ బాక్సర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్‌లో వరుణ్ శిక్షణ తీసుకున్నారు. బల్క్ లుక్‌తో రెడీ అయ్యారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల విశాఖపట్నంలో ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు విలన్‌గా మరో యంగ్ హీరో నటిస్తున్నారు. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. తొలి సినిమాతో ఆకట్టుకున్నా ఆ తరవాత మనోడికి సరైన హిట్టు పడలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేయడం మొదలుపెట్టారు నవీన్. ‘నేను లోకల్’, ‘అరవింద సమేత’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు. అయితే, ఇప్పుడు వరుణ్ తేజ్‌కు మెయిన్ విలన్‌గా చేస్తున్నారు. బాక్సింగ్ రింగ్‌లో వరుణ్‌తో ఫైట్‌కు సిద్ధమవుతున్నారు. Also Read: ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం చాలా మంది హీరోలను పరిశీలించారట. ఆఖరికి నవీన్ చంద్రను ఫైనల్ చేశారు. నవీన్ కూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి సన్నద్ధమయ్యారు. సుమారు 45 రోజుల పాటు కష్టపడి ఆయన తన ఫిజిక్‌ను ట్రాన్స్‌ఫాం చేశారు. హైదరాబాద్‌కు చెందిన బాక్సింగ్ కోచ్ పర్యవేక్షణలో కిక్ బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. నిర్విరామంగా సాగిన ఈ శిక్షణ అనంతరం ఇటీవల ఆయన వైజాగ్ వెళ్లారు. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలో రవితేజ, సుబ్బరాజును బాక్సింగ్ రింగులో చూశాం. అప్పటికీ అదే గొప్ప. కానీ, ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలో తీవ్రత, గాఢత మరింత ఎక్కువగా ఉంటుంది. హల్క్‌ల మాదిరిగా తయారైన ఇద్దరు ఆజానుబాహుల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. అయితే, ఈ సినిమాలో తన పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్‌లో ఉండదని నవీన్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. కాగా, ఈ సినిమాకు ‘బాక్సర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IeYFC3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...