Tuesday, 3 March 2020

2 కోట్ల నుంచి 2 లక్షలు.. భారీగా పడిపోయిన సునీల్ రెమ్యునరేషన్

స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్. వందలాది సినిమాల్లో నటించిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అప్పట్లో సునీల్ లేకుండా ఏ సినిమా ఉండేది కాదు. ఆ తర్వాత సునీల్ జాతకం మారిపోయి కమెడియన్‌ నుంచి హీరోగా ఎదిగిపోయాడు. అయితే హీరోగా మారినప్పటికీ అల్లరి నరేష్‌లా కామెడీ హీరోలా కొన్ని సినిమాల్లో చేసాడు. ఆ తర్వాత హీరోకు ఉండాల్సిన సిక్స్ ప్యాక్ పెంచి కామెడీ నుంచి సీరియస్ హీరో అవ్వాలని అనుకున్నాడు. అలా ‘తడాఖా’ సినిమాతో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. కానీ కమెడియన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న సునీల్‌కి హీరో ఇమేజ్ సరిపోలేదు. దాంతో మధ్యలోనే ఆయన హీరో ఇమేజ్‌కు బ్రేక్ పడింది. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చి ‘డిస్కో రాజా’ సినిమాతో విలన్‌గా కొత్త గెటప్ ఎత్తారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఇక నుంచి విలన్‌గా ట్రై చేయాలని అనుకుంటున్నట్లు ఓ సందర్భంలో అన్నారు. అయితే సునీల్ సినీ కెరీర్‌లో మార్పులు వచ్చినట్లే ఆయన తీసుకునే రెమ్యునరేషన్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు హీరోగా చేస్తున్నప్పుడు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకునేవాడట సునీల్. ఆ తర్వాత ఇమేజ్ పడిపోతూ రావడంతో ప్రస్తుతం ఏ సినిమా చేసినా కూడా రోజుకి రెండు లక్షలు తీసుకుంటున్నాడట. ఆ డబ్బు కూడా రోజంతా కాల్‌షీట్స్ ఇస్తేనే. లేకపోతే అందులోనూ కోతలు ఉంటాయని తెలుస్తోంది. READ ALSO: కనీసం సపోర్టింగ్ యాక్టర్‌గా అయినా ఆయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం సునీల్ ‘కలర్ ఫొటో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో సునీల్ ఎస్సై రామరాజు అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన బర్త్‌డే సందర్భంగా లుక్ రివీల్ చేసారు. లుక్‌లో సీరియస్ పోలీసు అధికారిగా చాలా బాగా సరిపోయారు. దీంతో పాటు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమాలోనూ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. పవన్‌తో పాటు ఉండే పాత్రనే క్రిష్ సునీల్ కోసం రాసారట. అయితే సినిమా టీం నుంచి అఫీషియన్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39kaHG3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...