తన పుట్టినరోజు సందర్భంగా శర్వానంద్ కొత్త సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం రామ్‌తో ‘రెడ్’ సినిమా చేస్తోన్న ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ సినిమాను అంగీకరించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భిన్న కథలతో సినిమాలు చేస్తూ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన శర్వానంద్ ఇప్పుడు కిశోర్ తిరుమలతో ఎలాంటి సినిమా చేయబోతున్నారనే ఆసక్తి కలుగుతోంది. గతంలో శర్వానంద్‌తో ‘పడి పడి లేచే మనసు’ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నిర్మాతగా ఇదే ఆయన తొలి చిత్రం. ప్రస్తుతం రానా హీరోగా ‘విరాటపర్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్‌తో ఆయన నిర్మించనున్న సినిమా నిర్మాతగా ఆయనకు మూడవది. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారు అనే విషయాన్ని, తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. Also Read: కాగా, శర్వానంద్ శుక్రవారం (మార్చి 6న) తన 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కిశోర్. బి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. శర్వానంద్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3atqum0
v
No comments:
Post a Comment