అక్కినేని కోడలు అక్కినేని త్వరలో శుభవార్త వినిపించబోతున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇంతకీ విషయం ఏంటంటే.. నెల రోజుల క్రితం సమంత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా నటించనున్నారు. ఇంతవరకు తాను ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ వినలేదని అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నానని సమంత అన్నారు. అయితే ఇప్పుడు సమంత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆమె తల్లి కాబోతుండడమే అని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనిపై సమంత ఏమంటారో వేచి చూడాలి. గతంలో కూడా గర్భం దాల్చారంటూ వచ్చిన వార్తలపై సమంత గట్టిగానే స్పందించారు. ఫ్యాన్స్ పోరు పడలేక 2021లో ఆగస్ట్‌లో బిడ్డను కనబోతున్నానని అన్నారు. అయితే నిజంగా అన్నారా జోక్‌గా అన్నారా అన్నది ఆమెకే తెలియాలి. మరి ఇప్పుడు వస్తున్న వార్తలపై ఆమె ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే తనకు పుట్టబోయే బిడ్డ గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. అలా జరిగితే కొన్నేళ్ల పాటు అన్నింటికీ దూరంగా ఉంటానని తెలిపారు. READ ALSO: ఆ బిడ్డే తనకు సర్వస్వం అని స్పష్టం చేశారు. తన బాల్యంలో చాలా కష్టాలు పడ్డానని చెప్పారు. తాను పొందలేనివన్నీ తన బిడ్డకు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని సమంత తెలిపారు. ఇకపోతే సమంత నటించాల్సిన సినిమాలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uYkD9k
v
No comments:
Post a Comment