Tuesday, 3 March 2020

‘రాములో రాముల’ ఫుల్ వీడియో సాంగ్.. దోసె స్టెప్ షురూ చేయండిక!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. కాగా, ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో అంతకన్నా ఎక్కువ ఆల్బమ్ పాపులర్ అయ్యింది. ఈ సినిమాకు తమన్ అందించిన ఆల్బమ్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లిపోయింది. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు జనాల నోటిలో బాగా నానాయి. ‘సామజవరగమన’ పాట అయితే సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ‘రాములో రాముల’ పాట అయితే తెలంగాణ యాసలో సాగుతూ ఆల్బమ్‌లో మంచి మాస్ సాంగ్‌గా నిలిచింది. ఈ పాటలో దోసె స్టెప్ బాగా పాపులర్ అయ్యింది. Also Read: ఇప్పటికే ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్స్‌ని విడుదల చేశారు. తాజాగా ‘రాములో రాముల’ వీడియో సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లి పాడారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో సాంగ్ చూస్తూ మీరూ దోసె స్టెప్ షురూ చేయండిక!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39mW3hw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...