Tuesday, 3 March 2020

శ్రీరెడ్డి హెచ్చరిక.. ఆ వీడియోలు తొలగించలేదో లీగల్ నోటీసులే

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో తనకు జరిగిన అన్యాయంపై గట్టిగానే పోరాటం చేసింది . అర్థనగ్న ప్రదర్శనతో నేషనల్ మీడియాను సైతం తన వైపు తిప్పుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో చాలా మీడియా సంస్థలు ఆమెను పట్టించుకోవడం మానేయడంతో సోషల్ మీడియాతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ని ఆయుధంగా చేసుకుని తన పోరాటాన్ని కొనసాగించింది. Read Also: అయితే ఇప్పుడు అలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో తనను కించపరుస్తూ కొరియోగ్రాఫర్ రాకేష మాస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తుండటంతో ఆ ఛానల్స్‌కి లీగల్ నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇస్తోంది శ్రీరెడ్డి. తన గురించి మాట్లాడిన ఇంటర్వ్యూలను తొలగించకపోతే వాళ్లకు లీగల్‌ నోటీసులు అందిస్తానని హెచ్చరిస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. Read Also: ఇదిలా ఉంటే.. గతంలో శ్రీరెడ్డి కూడా రాకేష్ మాస్టర్‌ స్థాయిలోనే పలు యూట్యూబ్ ఛానల్స్‌లో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపై దారుణంగా మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకవేళ శ్రీరెడ్డి నిజంగానే ఆ ఛానల్స్‌కి లీగల్ నోటీసులు పంపిస్తే శ్రీరెడ్డి కూడా నోటీసులు తీసుకోవాలి కదా.. అంటూ పలువురు స్పందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39lPlrN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...