Tuesday, 3 March 2020

‘నేనే నా..?!’ టెర్రిఫిక్ ఫస్ట్ లుక్.. శూర్పణఖగా రెజీనా

దక్షిణాదిలో మంచి ప్రతిభ కలిగిన నటీమణుల్లో రెజీనా కసండ్ర ఒకరు. ‘ఎస్ఎంఎస్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ చెన్నై బ్యూటీ ఆ తరవాత చాలా సినిమాలు చేశారు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ రెజీనాకు తెలుగులో సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే, కిందటేడాది ‘ఎవరు’ సినిమాతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెజీనా ఇప్పుడు మరో మిస్టరీ థ్రిల్లర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?!’. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతుంది. ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ సినిమాతో సూప‌ర్‌హిట్ అందుకుని తన ప్రత్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శకుడు కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఇనుప చువ్వల మ‌ద్య బంధీగా ఉన్న మ‌హారాణి పాత్రధారిగా రెజీనా క‌సండ్ర లుక్‌ టెర్రిఫిక్‌గా ఉంది. అయితే, తమిళ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమిళంలో ఈ చిత్రానికి ‘శూర్పణగై’ అనే టైటిల్ పెట్టారు. అంటే, తెలుగులో శూర్పణఖ అని అర్థం. ఈ సినిమాను సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తు్న్నారు. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా, ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ.. ‘‘మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘నేనే నా..?!’ సినిమాను కార్తీక్ రాజు అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈరోజు వ‌రుణ్‌ తేజ్‌ మా సినిమాలోని రెజీనా లుక్‌ను విడుద‌ల చేశారు. ఆయ‌నకు మా యూనిట్ త‌ర‌పున స్పెష‌ల్ థాంక్స్‌. రెజీనా లుక్‌కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు. న‌టిగా ఆమెను మ‌రో యాంగిల్‌లో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఆమె స్పెష‌ల్‌గా ట్రైనింగ్ తీసుకుని యాక్షన్ స‌న్నివేశాల్లో న‌టిస్తున్నారు’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VH5fJC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...