Thursday, 26 March 2020

రామ్ చరణ్ బర్త్‌డే: రామరాజు కోసం భీమ్ సర్‌ప్రైజ్ వీడియో

‘బాహుబ‌లి’ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా తెరకెక్కుతోన్న భారీ చిత్రానికి ‘రౌద్రం రుధిరం ర‌ణం’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ లోగోను, మోష‌న్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రేపు (మార్చి 26న) ఒక స్పెషల్ వీడియోను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఈ వీడియోను సర్‌ప్రైజ్‌గా ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. Also Read: ‘‘సోదర రామ్ చరణ్, మంచి పరిస్థితుల్లో నీ పుట్టినరోజును జరుపుకోవాలని నేను భావించాను. కానీ, ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఎందుకంటే, ఇంటిలో ఉండటమే ఇప్పుడు ముఖ్యం. రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఇది నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతి అవుతుంది. రామరాజు కోసం భీమ్’’ అని ఎన్టీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. ‘‘వాహ్! నేను సరైన సమయంలో ట్విట్టర్‌లో చేరానని అనుకుంటున్నాను. లేదంటే నీ సర్‌ప్రైజ్ మిస్ అయ్యేవాడిని సోదర. రేపటి కోసం వేచిచూడలేక పోతున్నాను’’ అని చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, రేపు రామ్ చరణ్ అభిమానులకు పండగే. నిజానికి రామ్ చరణ్ పుట్టినరోజు నాడు RRRలో ఆయన లుక్‌ను విడుదల చేస్తే బాగుంటుందని చాలా మంది అభిమానులు కోరుకున్నారు. కానీ, రేపు అంతకు మించిన సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. కాగా, ఈ చిత్రంలో కీల‌క పాత్రలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, చ‌ర‌ణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. ఇంకా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీలు ఇతర కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UErCwR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...