Thursday, 26 March 2020

ఎన్టీఆర్ రూ.75 ల‌క్షల విరాళం.. వారి కోసం రూ.25 లక్షలు

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చ‌ర్యలు చేప‌డుతున్నాయి. కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తమిరి కొట్టేందుకు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించారు. కరోనాపై పోరాటానికి, ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజల సహాయార్థం నిధులు అవసరం ఎంతో ఉంది. అందుకే, టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్రముఖులు ఇప్పటికే త‌మ వంతు సాయంగా ప్రభుత్వాలకు విరాళాల‌ను ప్రక‌టించారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75 ల‌క్షల విరాళాన్ని ప్రక‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25 ల‌క్షలు.. అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్షల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్షల‌ను క‌రోనా వైర‌స్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌చేస్తున్నారు. Also Read: ఇదిలా ఉంటే, ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నితిన్, అనిల్ రావిపూడి తదితరులు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలు అందజేశారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మరో కోటి రూపాయలను అదనంగా పీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సినీ కార్మికుల సహాయార్థం కోటి రూపాయలను ప్రకటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ వారి కోసం రూ.25 లక్షలు ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UFgyQa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...