Thursday, 26 March 2020

ప్రతి ఒక్కరికీ రూ.10 వేల సాయం: అల్లరి నరేష్

కరోనా వైరస్‌‌ను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించడంతో సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే, సినిమా షూటింగులన్నీ ఆగిపోవడం వల్ల ప్రధానంగా నష్టపోయేది రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులు, సాంకేతిక సిబ్బంది. అందుకే, వారిని ఆదుకోవడం కోసం సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమవాళ్లకు అండగా తాము ఎప్పుడూ ఉంటామని నిరూపిస్తున్నారు. సినీ కార్మికుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఇప్పుడు అల్లరి నరేష్ కూడా తన వంతు సాయాన్ని ప్రకటించారు. అల్లరి నరేష్ హీరోగా ప్రస్తుతం ‘నాంది’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో ఈ సినిమాకు పనిచేసే కార్మికులందరికీ సాయంగా నిలవాలని అల్లరి నరేష్, సతీష్ వేగేశ్న నిర్ణయించారు. ప్రతి ఒక్క కార్మికుడికి రూ.10 వేలు అందజేయనున్నట్టు ప్రకటించారు. Also Read: “మనిషిగా.. కష్టం వచ్చినప్పుడు.. అందరం అందరికోసం నిలబదలేకపోవచ్చు, కానీ ప్రతీ ఒక్కరూ పక్కవారి కోసం ఎంతో కొంత చెయ్యగలం. కోవిడ్ 19 నివారణ కోసం జరిగే ఈ 21 రోజుల లాక్‌ డౌన్‌ వల్ల మా “నాంది” యూనిట్‌‌లో రోజువారి వేతనంతో జీవనం సాగించే 50 మందికి పైగా ఉన్న మా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా వుండాలని, మా యూనిట్‌ తరఫున నేను.. మా నిర్మాత సతీష్‌ వేగేశ్న గారు కలసి ప్రతి ఒక్కరికి తలా 10 వేల రూపాయలు సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం. ఈ సాయం కావాలి.. మరిన్ని సాయాలకు నాంది’’ అని అల్లరి నరేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UnNZYN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...