ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై యుద్ధాన్ని ప్రకటించాయి. వీటిలో భారత్ కూడా ఉంది. కరోనాపై యుద్ధమంటే కేవలం ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చొని చేయాల్సిందే. జనసమూహానికి దూరంగా ప్రజలు వారి ఇళ్లలో భద్రంగా ఉండటమే కరోనాపై చేసే పోరాటం. నిన్న మొన్నటి వరకు ఈ సూచనలతో ప్రజలను చైతన్యం చేసిన సినీ తారలు.. ఇప్పుడు కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధులకు తమ వంతు బాధ్యతగా భారీ విరాళాలు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కలిపి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెరో కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు, దర్శకుడు త్రివిక్రమ్ రూ. 20 లక్షలు, దర్శకుడు అనిల్ రావిపూడి రూ. 10 లక్షలు, దిల్ రాజు రూ.10 లక్షలు ప్రకటించగా.. ఇప్పుడు వీళ్ల జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేరారు. పవన్ కళ్యాణ్, మహేష్ మాదిరిగా ప్రభాస్ కూడా కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు ప్రకటించారు. Also Read: ‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన భారత దేశంలో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్లిష్టపరిస్థితులలో కరోనాపై పోరాటానికి ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు నా వంతు బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నాను’’ అని ప్రభాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ తాను విరాళం ఇస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bkvslI
v
No comments:
Post a Comment