Thursday, 26 March 2020

రాననుకున్నావా.. రాలేననుకున్నావా?: మోహన్‌ బాబుకి చిరంజీవి పంచ్

మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు మధ్య చమత్కారాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా మోహన్ బాబును చిరంజీవి ఆటపట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే, వాళ్లిద్దరూ మంచి మిత్రులు. అప్పుడెప్పుడో చిన్న మనస్పర్థలు వచ్చినా.. అవి మళ్లీ సమసిపోయి వీరిద్దరూ మంచి స్నేహితులుగా కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోజు కూడా మోహన్‌ బాబుపై చిరంజీవి సరదాగా జోకులు వేశారు. ఆయన గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టారు. అంతకు ముందుకు మంచు విష్ణు తన నివాసంలో ఇచ్చిన విందులో కూడా చిరంజీవి పాల్గొన్నారు. ఆరోజు కూడా చిరంజీవి, మోహన్ బాబు మధ్య సరదా క్షణాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. కాకపోతే, అది ట్విట్టర్‌లో. ఉగాది రోజున మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో చేరిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌లోకి ఆయనకు స్వాగతం పలుకుతూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. ‘‘మిత్రమా వెల్‌కమ్’’ అని చిరంజీవిని ట్యాగ్ చేసి మోహన్ బాబు సింపుల్ ట్వీట్ చేశారు. దీనికి చిరంజీవి అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘‘థాంక్యూ మిత్రమా మోహన్ బాబు. రాననుకున్నావా.. రాలేననుకున్నావా?’’ అంటూ ‘ఇంద్ర’ సినిమా డైలాగుతో చిరంజీవి పంచ్ వేశారు. ఈ ట్వీట్‌కు మోహన్ బాబు స్పందిస్తూ.. ‘‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెపుతాను’’ అని పేర్కొన్నారు. ఈ ట్విట్టర్ సంభాషణకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎంటర్‌టైన్మెంట్ అంటే ఇలా ఉండాలి అంటూ చాలా మంది రిప్లైలు ఇస్తున్నారు. అంతేకాదు, మోహన్ బాబు ‘హగ్’ అనే పదాన్ని వాడినందుకు మధ్యలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని లాక్కొచ్చారు. ‘వెనుకనుంచి హగ్ చేసుకుంటారా?’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3an3DZM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...