Monday, 24 February 2020

నాతో డేట్‌కి రమ్మంటే అలా అంటావా: ప్రదీప్‌పై కాజల్ సెటైర్

యూత్‌ స్టార్‌గా ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఇప్పటివరకు ఎన్నో షోలకు యాంకరింగ్ చేసి, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవబోతున్నారు. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటకు ఇప్పటివరకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఏకంగా మూడు కోట్ల మంది పాటను విన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రదీప్ హైదరాబాద్ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ ప్రదీప్‌ను ఓ చిలిపి ప్రశ్న అడిగారు. ప్రదీప్‌ సినీ నటి కాజల్ అగర్వాల్‌కు పెద్ద ఫ్యాన్. ఒకవేళ కాజలే స్వయంగా డేటింగ్‌కి రమ్మంటే ఏం చేస్తావ్ అని అడిగారు. ఇందుకు ప్రదీప్ ఆన్సర్ ఇస్తూ.. ‘ముందైతే షాక్‌తో కళ్లు తిరిగిపడిపోతాను. ఆ తర్వాత నన్ను నేను గిచ్చుకుని ఇదంతా నిజం కాదని అనుకుంటాను. ఒకవేళ నిజంగానే కాజల్ డేట్‌కి వెళ్దాం అని అడిగితే.. నో మేడమ్.. నాతో జోకులు వేయకండి అంటాను’ అన్నాడు. ఈ ఇంటర్వ్యూపై కాజల్ రియాక్ట్ అయ్యారు. ‘ప్రదీప్.. ఇలాంటి కఠినమైన ప్రశ్నకు కాస్త క్రియేటివ్ ఆన్సర్ ఆలోచించు. నీ సినిమాకు ఆల్ ది బెస్ట్’ అని రిప్లై ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39XnoGO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...