Monday, 24 February 2020

డబుల్ జోష్‌తో పెళ్లి వేడుక చేసుకో.. నితిన్‌కు బన్నీ అభినందన

‘భీష్మ’ సినిమా ఘనవిజయం సాధించడంతో నితిన్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. డబుల్ కంగ్రాట్యులేషన్స్ అంటూ ట్వీట్ చేశారు. నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ‘భీష్మ’ ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు చాలా దగ్గరగా ఉందని పరిశ్రమకు చెందిన ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఇటీవలే పెళ్లి పనులు మొదలుపెట్టిన నితిన్.. ఆ తరవాత ‘భీష్మ’ సినిమాతో హిట్టు కూడా కొట్టడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభినందించారు. ‘‘డబుల్ కంగ్రాట్యులేషన్స్ నితిన్. ఇప్పుడు పెళ్లి వేడుకలు రెట్టించిన ఉత్సాహంతో జరుగుతాయి. ఒక మంచి సమయంలో మరో మంచి జరిగింది. ఇది నీకు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ‘భీష్మ’ చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు’’ అని అల్లు అర్జున్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక దర్శకుడు వెంకీ కుడుములు, హీరోయిన్ రష్మిక మందన, నిర్మాత సూర్యదేవర నాగవంశీలను కూడా అభినందిస్తూ మరో ట్వీట్ చేశారు బన్నీ. ‘‘కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను ఇచ్చినందుకు డైరెక్టర్ వెంకీ గారికి అభినందనలు. రష్మిక మందన ఒక ఆల్ రౌండర్. 2020 జనవరి, ఫిబ్రవరిలో వరుస విజయాలు అందుకున్న నా నిర్మాత వంశీకి అభినందనలు. ప్రతి ఒక్కరికీ మరోసారి అభినందనలు’’ అని ట్వీట్‌లో బన్నీ వెల్లడించారు. బన్నీ ట్వీట్లకు డైరెక్టర్ వెంకీ, రష్మిక స్పందించారు. తమ సినిమాను ప్రశంసించినందుకు వాళ్లు బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. కాగా, హారిక అండ్ హాసిని క్రియేష్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలు ఒకరివే. బహుశా ఈ సాన్నిహిత్యంతోనే సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో వచ్చిన ‘భీష్మ’కు అల్లు అర్జున్ కాస్త ప్రచారం కల్పిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32kd0pU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...