అభిమానులు పొందడం, వారి మనసులను గెలుచుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే ఈరోజు సెలబ్రిటీలు ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు అభిమానులే కారణం. కానీ అదే అభిమానం వేధింపులకు దారి తీస్తే? బాలీవుడ్ నటి హీనా ఖాన్‌కి ఇదే అనుభవం ఎదురైంది. ఓ అభిమాని తనను చాలా కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘మేం పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మమ్మల్ని 24 గంటలూ కనిపెట్టేవారు చాలా మంది ఉంటారు. అభిమానులు కూడా ఉంటారు. ఇంటి ముందు రోజుల తరబడి ఎదురుచూసే ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇలాంటి వాళ్లని ఎదుర్కోగలం కానీ ఓ అబ్బాయి ఉన్నాడు. అతను మాత్రం నన్ను చాలా కాలంగా టార్చర్ చేస్తున్నాడు. నా నెంబర్ తెలుసుకుని తెగ మెసేజ్‌లు చేస్తుంటాడు. అతను ఎవరో నాకు తెలీదు. ఒక్కోసారి నేనంటే ఎంత ఇష్టమో గట్టిగా కేకలు వేస్తూ వీడియోలు కూడా తీసి పంపుతూ ఉంటాడు. దాంతో ఓసారి అతనికి రిప్లై ఇచ్చాను. ఇలాంటి పనులు చేయకు అని చెప్పాను. కానీ అతను వినలేదు’’ READ ALSO: ‘‘పైగా ఇంకా వేధించడం మొదలుపెట్టాడు. నేను మాట్లాడకపోతే చెయ్యి కోసుకుంటానని బెదిరించాడు. రాత్రి 1 గంటకు కలుస్తాను అంటాడు. అతను ఎవరో ఎక్కడుంటాడో ఎలా కలుస్తాడో ఇవేవీ తెలీవు. దాంతో భయం వేసేది. 1 గంటకు ఎక్కడ ఇంటికి వచ్చేస్తాడోనని భయపడి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు చాలా సార్లు ఆ నెంబర్‌ను బ్లాక్ చేశాను. కానీ దాదాపు ఇరవై సార్లు సిమ్ కార్డులు మార్చేసాడు. కొన్ని రోజుల క్రితమే మరో నెంబర్‌ను బ్లాక్ చేసాను’’ అని వెల్లడించారు హీనా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2v5urya
v
No comments:
Post a Comment