Thursday, 6 February 2020

Baaghi 3 Trailer: బాప్‌రే.. ఇలాంటి ఫైటింగ్ మీరెప్పుడూ చూసుండరు

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కెరీర్‌లో ‘బాఘి’ బ్లాక్ బస్టర్ సిరీస్‌గా నిలిచిపోయింది. 2016లో వచ్చిన ‘బాఘి’ సినిమా మంచి విజయం అందుకుంది. మన తెలుగు బ్లాక్ బస్టర్ ‘వర్షం’కు ఈ సినిమా రీమేక్‌గా వచ్చింది. ఆ తర్వాత 2018లో ‘బాఘి 2’ వచ్చింది. ఇందులో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ నటించారు. ఈ సినిమాను కూడా మన నుంచే కాపీ కొట్టారు. ఇప్పుడు మూడో సీక్వెల్ రాబోతోంది. దీనికి టైటిల్ ‘’ అని పెట్టారు. ఇందులో టైగర్‌కు జోడీగా మరోసారి శ్రద్ధా కపూర్ నటించారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో రితేష్ దేశ్‌ముఖ్.. టైగర్ సోదరుడి పాత్రలో నటించారు. రితేష్‌ను కాపాడుకోవడం కోసం టైగర్ ఉగ్రమూకలను ఎలా మట్టుబెట్టాడు అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే మొదటి రెండు సినిమాలను కాపీ కొట్టారు కానీ ఈ సినిమాను మాత్రం సొంత స్క్రిప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో మనం చెప్పుకోవాల్సింది కేవలం ఫైటింగ్ సన్నివేశాల గురించే. టైగర్ దేహదారుఢ్యానికి తగ్గట్టుగా ఫైటింగ్ సన్నివేశాలను కంపోజ్ చేశారు. ట్రైలర్‌లో కేవలం ఫైటింగ్ సన్నివేశాలే హైలైట్‌గా నిలిచాయి. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను పెట్టినట్లు తెలుస్తోంది. READ ALSO: ముఖ్యంగా టైగర్ కార్లపై నుంచి ఎగురుకుంటూ వెళ్లి కొట్టే సన్నివేశం ట్రైలర్‌కే హైలైట్. ఒక మనిషిని నాలుగైదు సార్లు కాలితో తన్నే సన్నివేశం కేక పెట్టించేలా ఉంది. టైగర్ మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట. అందుకే ఈ సన్నివేశాల్లో సులువుగా నటించేశాడు. ఇకపోతే రితేష్ దేశ్‌ముఖ్ పాత్ర సినిమాకు కీలకం అని చెప్పాలి. ఇక హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కి ఈసారి కేవలం పాటలకు, రొమాన్స్‌కు పరిమితం చేయకుండా ఫైటింగ్ సీన్లలో కూడా వాడుకున్నారు. మరి మొదటి రెండు సినిమాల్లాగే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బొమ్మ దద్దరిల్లేలా చేస్తుందో లేదో వేచి చూడాలి. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37Z58MC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...