Thursday, 6 February 2020

Rajinikanth: కొంపముంచిన ‘దర్బార్’.. పోలీసులను ఆశ్రయించిన మురుగదాస్

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది కానీ డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బు మాత్రం రాలేదు. దాంతో చాలా కాలంగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఏ.ఆర్ మురుగదాస్ తెరెకెక్కించిన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు వసూళ్లు చేసింది. అయితే సినిమాకు ప్రచారం మాత్రం ఓ రేంజ్‌లో చేశారు. విమానాలపై దర్బార్ పోస్టర్లు అతికించేసి కాస్త ఓవర్ చేశారు. సినిమాపై అంత హైప్ క్రియేట్ చేశారు కానీ ఆ హైప్‌కు తగ్గ వసూళ్లు రాబట్టలేదు. దాంతో భారీ మొత్తానికి సినిమాను కొనుక్కున్న పలువురు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. దాంతో చాలా కాలంగా తమకు నష్టపరిహారం చెల్లించాలని లైకా ప్రొడక్షన్స్ సంస్థ, రజినీకాంత్ చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల పలువురు డిస్ట్రిబ్యూటర్లు రజినీకాంత్‌ను కలవాలని ఆయన నివాసం వద్దకు వెళ్లారట. కానీ భద్రతా సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. దాంతో ఫిబ్రవరి 3న ఏకంగా దర్శకుడు మురుగదాస్ ఆఫీస్‌లోకి చొరబడ్డారట. దాంతో మురుగదాస్ పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను కోరారు. READ ALSO: ‘‘గుర్తుతెలియని 25 మంది నా కార్యాలయంలోకి ప్రవేశించి నానా హంగామా చేశారు. నా స్టాఫ్‌పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు. మరో పదిహేను మంది ఆఫీస్ బయట నిలబడి నన్ను నోటికొచ్చినట్లు తిట్టారు. నా పేరు చెడగొట్టాలని పలు టీవీ ఛానెల్స్‌కు తప్పుడు సమాచారం అందిస్తున్నారు’’ అని మురుగదాస్ పిటిషన్‌లో పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు నష్టం వస్తే ఆదుకోవడానికి రజినీ ఎల్లప్పుడూ ముందుంటారు. కానీ ఈసారి ఈ వివాదంపై రజినీ ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలీడంలేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31sw9FS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...