Tuesday, 18 February 2020

అమ్మకు ప్రేమతో.. సురేఖకు చరణ్ బర్త్‌డే విషెస్

మెగాస్టార్ చిరంజీవి సతీమణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి కొణిదెల సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన తల్లికి రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందమైన పుష్పగుచ్ఛాలను అమ్మకు అందజేశారు. తన భార్య ఉపాసనతో కలిసి అమ్మతో కాసేపు సరదాగా గడిపారు. ఈ ఫొటోలను చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నా తొలిప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు. లవ్ యు మామ్’’ అని పేర్కొన్నారు. తన తల్లి సురేఖతో రామ్ చణ్ తీసుకున్న ఫొటోలు చాలా అందంగా ఉన్నాయి. ముఖ్యంగా తల్లికి ప్రేమతో ముద్దు పెట్టే ఫొటో విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే చరణ్, ఉపాసన దంపతులు సురేఖతో కలిసి తీసుకున్న ఫొటో కూడా చాలా బాగుంది. ఇక ఉపాసన సైతం తన అత్తమ్మకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌ డే అత్తమ్మ. లవ్ యు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో చిరంజీవి, సురేఖ దంపతుల పెళ్లిరోజు వస్తోంది. ఈనెల 20 నాటికి ఈ మెగా దంపతుల వైవాహిక జీవితానికి 40 ఏళ్లు పూర్తవుతుంది. కాగా, సురేఖను ఐఏఎస్ ఆఫీసర్‌కు ఇచ్చి పెళ్లిచేయాలని ఆమె తండ్రి అల్లు రామలింగయ్యకు ఉండేదని.. అయితే, అల్లు అరవింద్ బలవంతం మీద తనకు ఇచ్చి పెళ్లిచేశారని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చారు. ప‌ది మంది నిర్మాత‌ల‌ను త‌న గురించి అడిగి స‌ల‌హా తీసుకున్నాకే రామ‌లింగ‌య్య త‌మ పెళ్లికి ఓకే చెప్పారన్నారు. ఇక చిరంజీవితో పెళ్లి గురించి సురేఖ ప్రస్తావిస్తూ.. ‘‘మన వూరి పాండవులు సినిమా చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా..! మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుంటే బాగుంటుందనుకున్నా. అందుకే పెళ్లికి సరే అన్నాను’ అని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ దంపతులు 40 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తిచేసుకోవడమే కాదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది జంటలకు స్ఫూర్తి కూడా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SUm8NS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...