Monday, 17 February 2020

పూజా హెగ్డేతో సెల్ఫీ.. పాపం అంకుల్ ఎంత కష్టపడ్డారో!

సెలబ్రిటీలు తరచూ కనిపించే ఏకైక ప్రదేశం ఎయిర్‌పోర్ట్. ముంబైలో అయితే మరీనూ. అందుకే అక్కడి మీడియా వర్గాలు సెలబ్రిటీల ఫొటోలు తీసేందుకు ప్రత్యేకించి ఫొటోగ్రాఫర్లను నియమిస్తుంటాయి. ఇక ఫ్యాన్స్ అయితే రోజుకి ఒక సెలబ్రిటీతో కచ్చితంగా సెల్ఫీలు దిగుతుంటారు. ఈరోజు ఉదయం ‘బుట్టబొమ్మ’ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుండగా.. ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఓ అంకుల్ పూజాతో సెల్ఫీ దిగాలని యత్నించారు. పూజ కూడా ఆయన కోసం కొద్ది క్షణాలు ఆగారు. సాధారణంగా సెలబ్రిటీలు అంత సేపు కూడా ఆగరు. అలాంటిది అంకుల్ కోసం పూజ కాస్త ఎక్కువ సమయాన్నే కేటాయించారు. అయినా కూడా పాపం ఆయనకు లక్ కలిసిరాలేదు. ఎందుకంటే ఆయనకు ఫోన్ పట్టుకోవడం, సెల్ఫీ దిగడం రాలేదు. సెల్ఫీ దిగుతున్న సమయంలో చేతిలో నుంచి ఫోన్ జారిపోయింది. దాంతో ఫోన్‌ను అటు మార్చి ఇటు మార్చి మొత్తానికి ఏదో ఒకటి చేసారు. దాంతో పూజాతో పాటు అక్కడున్న ఫొటోగ్రాఫర్లు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత చాలా మంది ఫ్యాన్స్ వచ్చి పూజతో సెల్ఫీ దిగారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూజ తన కారులో అక్కడి నుంచి గబగబా వెళ్లిపోయారు. READ ALSO: ఇప్పుడు పూజ కెరీర్ పీక్స్‌లో ఉంది. ఇందుకు కారణం ‘అల వైకుంఠపురములో’ హిట్ అవడమే. పూజ అందుకున్న తొలి హిట్ ఇదే అని చెప్పాలి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ప్రస్తుతం పూజ ప్రభాస్‌తో, అఖిల్‌తో కలిసి నటిస్తోంది. మరోపక్క బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాలీ’ అనే సినిమాలో నటించనుంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/322QBgR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...