Tuesday, 18 February 2020

సందీప్ రెడ్డి వంగాకు షాకిచ్చిన బాలీవుడ్.. ఆఫర్ క్యాన్సిల్

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో డైరెక్ట్‌గా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసారు దర్శకుడు . ఇక్కడ సినిమాను ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్‌హిట్ కొట్టేసారు. దాంతో సందీప్‌కు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. టీ సిరీస్‌లాంటి అతిపెద్ద నిర్మాణ సంస్థ సందీప్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. సందీప్ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే సందీప్ ఏ హీరో సినిమా చేయాలన్నా ప్రస్తుతం వారి చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయాలి. అప్పటివరకు సందీప్ ఎదురుచూడాల్సిందే. ఈ నేపథ్యంలోనే టీ సిరీస్ సంస్థతో సందీప్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో మళ్లీ సందీప్ టాలీవుడ్‌కే వచ్చేసినట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో తెలుగు సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే రణ్‌బీర్‌తో సినిమా విషయంలో టీ సిరీస్ సందీప్‌కు షాకిచ్చింది కాబట్టి.. తెలుగు సినిమాను నిర్మిస్తామని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. కానీ సందీప్‌లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌కు హిందీలో మరో మంచి సినిమా పడి ఉంటే.. ఆయన అక్కడ పెద్ద దర్శకులకు గట్టి పోటీనిచ్చేవారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. READ ALSO: సందీప్ తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ సినిమాను ఎన్ని వివాదాలు చుట్టుమట్టాయో అందరికీ తెలిసిందే. సమంత, అనసూయ లాంటి ఎందరో ప్రముఖులు సందీప్ తన సినిమా గురించి సమర్ధించుకుంటూ చేసిన కామెంట్స్‌పై మండిపడ్డారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు రిలీజ్ అయ్య ఎన్నో నెలలు అయిపోతున్నా ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఎంతో మంది సెలబ్రిటీలు కబీర్ సింగ్ సినిమాను తప్పుబట్టిన కూడా బాలీవుడ్ నటి విద్యా బాలన్ మాత్రం సమర్ధించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37CiFcb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...