Monday, 10 February 2020

రోజా భర్త కామెంట్స్‌పై భగ్గుమన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

మూవీ నష్టాలతో ఉద్యమబాట పట్టారు ఈ సినిమా బయ్యర్లు. దర్బార్ సినిమాను కొనుగోలు చేయడం వల్ల సుమారు రూ. 50 కోట్లకు పైగా నష్టపోవడంతో న్యాయం చేయాలంటూ ఇటీవల ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు బయ్యర్లు. ఈ సినిమాలో నటించిన రజినీకాంత్, డైరెక్ట్ చేసిన మురుగుదాస్, నిర్మాణ సంస్థ లైకా అందరూ బాగానే సేవ్ అయ్యారని కేవలం బయ్యర్లు మాత్రమే అప్పుల పాలయ్యామంటూ ఆవేదన చెందుతున్నారు. అయితే బయ్యర్ల కష్టాల్లో భాగం పంచుకోవాల్సిన నిర్మాణ సంస్థ పట్టించుకోకపోవడంతో హీరో రజినీకాంత్, దర్శకుడు మురుగుదాస్‌లు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే వారి నుండి సరైన స్పందన రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు బయ్యర్లు. దర్శకుడు మురుగుదాస్‌పై ఫిర్యాదు చేయడంతో తమకు జరిగిన నష్టంపై ఆయన బాధ్యత వహించాలని కోరారు. అయితే ఇష్యూపై ఘాటుగా స్పందించారు తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు, నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమని. సినిమా వల్ల నష్టం వచ్చే బాధ్యత వహించాల్సింది నిర్మాతలు.. దర్శకుల్ని బాధ్యుల్ని చేసి వాళ్లపై కేసులు పెట్టడం సరికాదంటూ వ్యాఖ్యానించారు సెల్వమని. తమిళ దర్శకుల సంఘంలో సభ్యుడైన మురుగుదాస్‌కి తాము అండగా నిలుస్తామని.. సినిమాని కొనడం అమ్ముకోవడం బయ్యర్లకు సంబంధించిన విషయం.. అయినా సినిమాకి నష్టాలు వచ్చాయి కాబట్టి దర్శకుడు ఇవ్వాలని అంటున్నారు.. అదే లాభాలు వస్తే దర్శకుడికి ఇస్తారా? అంటూ ప్రశ్నించారాయన. అయినా ఇలాంటి పరిస్థితి రావడానికి హీరో రజినీకాంత్ కారణం అని ఆయనపై విమర్శలు గుప్పించారు సెల్వమని. గతంలో సినిమాని కొని నష్టపోయిన వాళ్లకు తిరిగి డబ్బులు ఇచ్చే సాంప్రదాయాన్ని రజినీకాంత్ తీసుకుని రావడంతో సినిమా ఆడకపోయిన ప్రతిసారి ఇలాంటిది జరుగుతూనే ఉంటుందని.. ఆయనకు ఇవ్వాలనిపిస్తే తిరిగి ఇవ్వొచ్చని ఇందులోకి దర్శకుల్ని లాగడం సరికాదంటూ చురకలేసారు సెల్వమని. కాగా సెల్వమని వ్యాఖ్యలపై అటు రజినీ ఫ్యాన్స్.. ఇటు దర్బార్ మూవీ బయ్యర్లు ఫైర్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2H9RNoZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...