Friday, 7 February 2020

నితిన్ పెళ్లి వాయిదా.. మనసు మార్చుకున్నాడా?

కుర్ర హీరో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. షాలిని అనే అమ్మాయిని నితిన్ దాదాపు నాలుగేళ్లుగా ఇష్టపడుతున్నారట. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వారూ ఒప్పేసుకున్నారు. దాంతో ఇదే ఏడాది పెళ్లి చేసేయాలని నిర్ణయించేసుకున్నారు. అదీకాకుండా ఓ ఇంటర్వ్యూలో ఇదే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నానని నితిన్ చెప్పడంతో ఓ క్లారిటీ వచ్చేసింది. పెళ్లి ఏప్రిల్ 15న జరగనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి వాయిదా పడిందని తాజా సమాచారం. పెళ్లి ఏప్రిల్‌లో కాకుండా మేలో పెట్టుకుందామని నితిన్ ఇంట్లో వారితో చెప్పినట్లు తెలుస్తోంది. వర్క్‌ వల్ల నితిన్ ఏప్రిల్‌లో పెళ్లి పెట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. దుబాయ్‌లోని పలాజో వర్సాచే హోటల్‌ నితిన్ పెళ్లికి వేదిక కాబోతోందట. ఇప్పటికే ఇంట్లో వారు అన్ని ఏర్పాట్లు చేసేశారట. మరో నెల రోజులు పెళ్లి వాయిదా వేశారు కాబట్టి వివాహం దుబాయ్‌లోనే జరుగుతందా లేకపోతే ఇండియాలోనే జరగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల సినిమాకు దర్శకత్వం వహిస్తు్న్నారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటించారు. 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. READ ALSO: భీష్మతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు నితిన్‌. ఈ సినిమా తరువాత విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి, దర్శకుడిగా మారిన లిరిసిస్ట్‌ కృష్ణ చైతన్యల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు 2020 ద్వితీయార్థంలో సెట్స్‌ మీదకు వెళ్లనున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/373hUs9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...