Saturday, 15 February 2020

అలివేలుమంగ వెంకటరమణ.. గోపీచంద్ కోసం రంగంలోకి తేజ

ఒకప్పుడు మంచి కమర్షియల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం బాగా వెనకబడిపోయారు. వరుస డిజాస్టర్లతో డీలా పడ్డారు. కిందటేడాది వచ్చిన ‘చాణక్య’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్‌కు జంటగా తమన్నా నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే, గోపీచంద్‌కు యాక్టర్‌గా బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తేజ. ‘నిజం’ సినిమాలో గోపీచంద్‌ను విలన్‌గా పరిచయం చేసి ఆయనలోని క్రూరత్వాన్ని చూపించారు. అయితే, ప్రస్తుతం గోపీచంద్ కష్టాల్లో ఉండటంతో ఆదుకోవడానికి తేజ రంగంలోకి దిగుతున్నారట. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్‌ను బట్టి గోపీచంద్‌తో తేజ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో రానా దగ్గుబాటి ప్రత్యేక పాత్రలో నటించనున్నారని సమాచారం. దీనికి ‘‘అలివేలుమంగ వెంకటరమణ’’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని అంటున్నారు. మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. Also Read: మరోవైపు, డైరెక్టర్ తేజ కూడా సరైన హిట్ అందుకుని చాలా కాలం అయ్యింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చినట్టు కనిపించిన తేజ.. కిందటేడాది ‘సీత’ సినిమాతో మెప్పించలేకపోయారు. నిజానికి ఈ రెండూ వైవిధ్యమైన సినిమాలే. అయితే, ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఒక పక్కా కమర్షియల్ సినిమాను గోపీచంద్‌తో చేయబోతున్నారని వినికిడి. ఔట్ అండ్ ఔట్ కామెడీతో ప్లాన్ చేస్తున్నారట. తేజ దర్శకత్వంలో 2001లో ‘ఫ్యామిలీ సర్కస్’ అనే సినిమా వచ్చింది. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రోజా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే, సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వదిలిపెట్టకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పిల్లల టార్చర్, రాజేంద్ర ప్రసాద్ చెప్పే చిల్డ్రన్ సైకాలజీ విపరీతంగా నవ్విస్తుంది. ఇప్పుడు గోపీచంద్ కోసం అలాంటి కామెడీని మళ్లీ తేజ ప్లాన్ చేస్తున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UTVI17
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...