‘జబర్దస్త్’, ‘ఢీ’ షోలతో యాంకర్ రష్మి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. మధ్యలో సినిమాలు కూడా చేస్తున్నారు. సాధారణంగా సినిమాకు సంబంధించిన వారు తాము సంపాదించుకున్న డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టాలని చూస్తుంటారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అపార్ట్‌మెంట్స్ కొనుక్కున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హోటల్ బిజినెస్ మొదలుపెట్టారు. మరో పక్క హీరోయిన్లలో రకుల్ జిమ్ సెంటర్స్ నడుపుతున్నారు. అదే విధంగా రష్మి భూములు కొన్నారట. ఒడిశాలో దాదాపు వంద ఎకరాల భూములు కొన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆంధ్రా- ఒడిశా బోర్డర్ దగ్గర ఉన్న బెర్హాపూర్ ప్రాంతంలో రష్మి పుట్టారు. ఆమె చదువంతా వైజాగ్‌లో జరిగింది. అందుకే రష్మికి తెలుగు భాషలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అయితే ఆమె కొన్న వంద ఎకారల భూమిలో కోకో, యూకలిప్టస్ పంటలను వేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలపై ఎలాంటి రూమర్స్ వచ్చినా రష్మి వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. మరి ఈ వంద ఎకరాల భూమి కొన్నట్లు వస్తున్న వార్తలపై రష్మి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bSC4sm
v
No comments:
Post a Comment