Wednesday, 19 February 2020

Bheeshma: ప్రమోషన్స్‌కి రానంటున్న హీరోయిన్?

యంగ్ హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ రిలీజ్‌కు సిద్ధమైంది. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. అయితే ఇందులో మరో హీరోయిన్‌ కూడా ఉన్నారట. ఆమె ఎవరో కాదు ‘కుమారి 21f’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన . ఈ సినిమాలో హెబ్బా చిన్న పాత్రలో నటించారట. అయితే ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేనట్లు తెలుస్తోంది. ‘భీష్మ’ సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో నితిన్, రష్మిక జోరుగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అయితే హెబ్బా మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. దాంతో సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం, లైవ్స్ చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివైనా చేయాలని టీం హెబ్బాకు చెప్పిందట. కానీ ఇందుకు హెబ్బా నో చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో హెబ్బాను చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏమీ లేదంట. ఆమాత్రం దానికి ప్రమోషన్స్‌కి వెళ్లినా ఫలితం ఉండదని అన్నారట. అందుకే మొన్న జరిగిన ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా రాలేదని టాలీవుడ్ వర్గాల సమాచారం. అదే నిజమైతే.. హెబ్బా తప్పు చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. అసలు హెబ్బాకు ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేవు. READ ALSO: అసలు హెబ్బా అనే హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్నారని కూడా చాలా మంది గుర్తులేకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇప్పుడే హెబ్బా బాగా ఉపయోగించుకోవాలి. ఏదో ఒక రకంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఉంటే హెబ్బా అనే హీరోయిన్ ఒకరు ఉన్నారని దర్శకులు, నిర్మాతలకు తెలుస్తుంది. కనీసం ఆ రకంగానైనా హెబ్బాకు అవకాశాలు వస్తాయి కదా. ప్రస్తుతం అల్లు అరవింద్‌కి చెందిన ‘ఆహా’ నుంచి వస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో హెబ్బా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SVXiNF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...