Wednesday, 19 February 2020

నా భర్త అబ్బాయికి లిప్ కిస్ ఇస్తే తప్పేంటి: హీరో భార్య

ప్రముఖ బాలీవుడ్ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’. హితేష్ కేవల్య దర్శకత్వం వహించారు. స్వలింగ సంపర్కం అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ గే పాత్రలో నటించారు. జితేంద్ర కుమార్.. ఆయుష్మాన్‌కు ప్రియుడి పాత్రలో నటించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్‌లో ఆయుష్మాన్.. జితేంద్రకు లిప్ కిస్ ఇస్తాడు. దాంతో ఈ టాపిక్ బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అయితే ఈ సీన్ గురించి ఆయుష్మాన్ భార్య తహీరా కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసారు. ‘‘నా భర్త మరో మగాడిని స్క్రీన్‌పై లిప్ కిస్ ఇవ్వడం చూసి ఎగ్జైట్ అయ్యాను. నేను ఆర్టిస్ట్ కోణం నుంచి చూస్తాను. ఓ ఆర్టిస్ట్ స్క్రీన్‌పైన అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే ఏంటి అబ్బాయిని ముద్దు పెట్టుకుంటే ఏంటి? ఒకవేళ నేను సినిమా తీసుంటే ఆర్టిస్ట్ చేత అలాగే చేయించేదాన్ని. ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమాలో నా భర్త గే కాబట్టి సాధారణంగా అబ్బయినే ముద్దు పెట్టుకుంటాడు. ఆ సన్నివేశం తప్పు అని చెప్పడానికి నేను ఎవరు. ఒక అబ్బాయికి అమ్మాయిపై ప్రేమ ఉన్నా, లేక అబ్బాయిపైన ప్రేమ ఉన్నా ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు పెట్టుకుంటాడు. అందులో తప్పేముంది’’ అని తెలిపారు. 2017లో వచ్చిన ‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమాకు ఈ సినిమా సీక్వెల్‌గా రాబోతోంది. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. READ ALSO: ప్రయోగాలు చేయడంలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాది అందెవేసిన చెయ్యి. ఏ సినిమా చేస్తే సమాజంలో ఎలాంటి ముద్రపడుతుందో అని భయపడే నటీనటులు ఉంటారు. కానీ ఆయుష్మాన్ అలా కాదు. కాస్త విభిన్నంగా ప్రయత్నిస్తూ ప్రేక్షకుడిని బుట్టలో వేసేసుకుంటారు. హీరోను చీరకట్టులో అమ్మాయి పాత్రలో చూడాలని ఏ ప్రేక్షకుడూ కోరుకోడు. అల చేస్తే హీరోయిజం ఏముంటుంది అనుకుంటారు. కానీ ‘డ్రీమ్ గర్ల్’ సినిమాతో హీరోలు కూడా ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చని నిరూపించారు ఆయుష్మాన్. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల వసూళ్లు రాబట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uMsarT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...