Saturday, 8 February 2020

‘‘పెళ్లి చేసుకో సల్మాన్... నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా’’

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఐదు పదుల వయసులోనూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్నాడు. దాదాపు ఐదేళ్లుగా సల్మాన్ ఖాన్ పెళ్లెప్పుడు చేసుకుంటాడు అన్న ప్రశ్న అందరి నోటా నానుతూనే ఉంది. ఎన్నోసార్లు సల్మాన్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. అయినా మీడియా వర్గాలు ఆయన్ను ఇదే ప్రశ్న అడిగి సతాయిస్తుంటాయి. దాంతో సల్మాన్‌ విసిగిపోయి కసుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి సల్మాన్‌ను పెళ్లి గురించి అడిగి ఏడిపించారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి. సల్మాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 13కు శిల్ప గెస్ట్‌గా వచ్చారు. వీరిద్దరూ కలిసి ‘తడప్ తడప్ కే’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. సల్మాన్, ఐశ్వర్య రాయ్ కలిసి నటించిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలోని పాట ఇది. ఈ పాటకు డ్యాన్స్ చేసాక.. శిల్ప సల్మాన్‌ను ఆటపట్టించారు. ‘ముందు పెళ్లి చేసుకో ఆ తర్వాత దోచుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది’ అని కామెంట్ చేసారు. దాంతో సల్మాన్ బోరున ఏడ్చేసారు. అయితే నిజంగా కాదులెండి. ఊరికే సల్మాన్ ఏడ్చి శిల్పను, అక్కడున్నవారిని నవ్వించారు. READ ALSO: సల్మాన్ ఖాన్ గతంలో చాలా మందితో ప్రేమ వ్యవహారం నడిపించారు. వారిలో ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, సంగీత బిజిలానీ ఉన్నారు. ఇటీవల రొమేనియన్ మోడల్ ఉలియా వంతూర్‌తో సల్మాన్ ప్రేమలో ఉన్నారని త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వచ్చింది. కానీ తనకు అసలు పెళ్లి ఆలోచనే లేదని సల్మాన్ ఎప్పుడో తేల్చేసారు. తాను మంచి భర్తను కాలేను కానీ మంచి తండ్రిని అవుతానని అన్నారు. బహుశా కరణ్ జోహార్, సన్నీ లియోనీ లాగా సల్మాన్ కూడా సరోగసీ ద్వారా పిల్లల్ని కంటారేమోనని టాక్ వస్తోంది. అంతేకాదు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ కూడా సల్మాన్‌ను ఆటపట్టించారు. పోయిన సారి బిగ్‌బాస్ షోకి అద్నాన్ తన మూడో భార్యతో కలిసి వెళ్లారు. అప్పుడు సల్మాన్.. అద్నాన్ సమీని ఆటపట్టించారు. ‘పోన్లే ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకోగలిగావు’ అన్నాడు. ఇందుకు అద్నాన్ సమీ సల్మాన్‌కు పంచ్ వేసాడు. ‘సమయంతో పాటే అన్నీ మారతాయి. కాబట్టి నువ్వు కూడా పెళ్లి చేసుకో. నన్ను చూడు మూడు సార్లు పెళ్లి చేసుకున్నాను’ అన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UISRIe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...