Sunday, 9 February 2020

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. రౌడీ ఫ్యాన్స్ హంగామా

ఫిబ్రవరి 14 కోసం లవర్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో.. రౌడీ ఫ్యాన్స్ ‘’ మూవీ కోసం అంతే ఎదురు చూస్తున్నారు. ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్‌కి ఏకంగా నలుగురు లవర్స్ ఉండటంతో కామన్ లవర్స్ కూడా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం ఎదురుచూస్తున్నారు. క్రాంతిమాధ‌వ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో కె వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించగా.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్నాడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌కు భారీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నార్సింగ్‌లో కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ నందు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రౌడీ ఫ్యాన్స్ ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల నుండి ఈ ఈవెంట్‌కు భారీగా తరలి వస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలలో స్పీచ్‌ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తన ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ సినిమాకి ప్రమోషన్స్ ఎలా రప్పించుకోవాలో అర్జున్ రెడ్డి చిత్రం నుండి బాగా వంటపట్టించుకున్న విజయ్.. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏ మాట్లాడతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UEjH4C
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...